PJNEWSPOWER OF JOURNALISM
⌂ Home
SCAN STORY
22 November 2026, 08:37 AM · నగర వార్తలుTHE DIGITAL EDITION OF Published by PJ Television Private Limited

ప్రజా సమస్యలపై సత్వర స్పందన.. రోజుకో వార్డులో డీసీ పర్యటన

ప్రజా సమస్యలపై సత్వర స్పందన.. రోజుకో వార్డులో డీసీ పర్యటన
ప్రజా సమస్యలపై సత్వర స్పందన.. రోజుకో వార్డులో డీసీ పర్యటన

ప్రాంతం: Allwyn Circle, Kukatpally

PJNews ఆల్విన్‌కాలనీ: ప్రజా సమస్యల పరిష్కారానికే తొలి ప్రాధాన్యం ఇస్తామని ఆల్విన్‌కాలనీ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ చాముండేశ్వరి తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రతి ఫిర్యాదుపై సత్వరమే స్పందించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు.

నవంబర్ 21న విడుదల చేసిన ప్రకటనలో సర్కిల్ పరిధిలోని కాలనీలు, బస్తీల్లో రోడ్లు, పారిశుద్ధ్యం, వీధి దీపాలు, చెత్త సేకరణ, ఇతర మౌలిక వసతులకు సంబంధించిన సమస్యలను తమ దృష్టికి తీసుకురావాలని ప్రజలను కోరారు. అందిన ఫిర్యాదులను సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేసుకుని పరిష్కరిస్తామని వివరించారు.

ఫిర్యాదులకు నాలుగు మార్గాలు

ప్రజలు MyCURE యాప్‌లో సిటిజన్ లాగిన్ ద్వారా, ఎక్స్‌ (ట్విట్టర్‌), సర్కిల్ కార్యాలయంలోని ఇన్‌వర్డ్ విభాగం ద్వారా ఫిర్యాదులు అందించవచ్చన్నారు. ప్రతి సోమవారం ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహించే ప్రజావాణిలో నేరుగా సమస్యలను తెలియజేయవచ్చని సూచించారు.

నవంబర్ చివరి నుంచి వార్డుల పర్యటన

ప్రజల వద్దకే వెళ్లి సమస్యలు తెలుసుకునేందుకు నవంబర్ చివరి నుంచి ప్రతిరోజూ ఒక వార్డులో పర్యటించే ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. క్షేత్రస్థాయిలో సమస్యలను పరిశీలించి పరిష్కార చర్యలు చేపడతామన్నారు.

టౌన్ ప్లానింగ్, ఇంజినీరింగ్, పారిశుద్ధ్యం, రెవెన్యూ శాఖల అధికారుల సంప్రదింపు వివరాలను ప్రజలకు అందుబాటులో ఉంచనున్నట్లు వెల్లడించారు.

అనుమతుల్లేని నిర్మాణాలు, నిబంధనల ఉల్లంఘనలు, రహదారులు, ప్రజా స్థలాల ఆక్రమణలపై ఫిర్యాదులు అందితే పరిశీలించి చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

కార్యాలయంలో ఫిర్యాదు చేసినా సమస్య పరిష్కారం కాకపోతే నేరుగా తన దృష్టికి తీసుకురావాలని చాముండేశ్వరి సూచించారు. పారదర్శకంగా, బాధ్యతాయుతంగా పనిచేస్తూ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవడమే లక్ష్యమన్నారు.

pjnewslive.comPJ NEWS owl mark

One continuous digital clipping. Long articles make a taller image; JPG/PDF export depends on browser canvas limits.