దీప్తినగర్‌లో జరిగిన హత్యను చేధించిన పోలీసులు
మియాపూర్ దీప్తిశ్రీనగర్‌లో జరిగిన మహిళ హత్య కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. మూడు రోజుల క్రితం, మియాపూర్ సీబీఆర్ ఎస్టేట్‌లోని 110 ఫ్లాట్ నెంబరులో నివసిస్తున్న స్పందన అనే మహిళను హత్య చేసిన సంఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
హత్య వెనుక మిత్రుడి పాత్ర
స్పందన మరియు ఆమె భర్త మధ్య వివాదాలు కొద్ది రోజులుగా కోర్టులో ఉన్నాయి. విడాకుల కోసం కేసు నడుస్తుండగా, ఈ హత్య జరిగినట్లు సమాచారం. విచారణలో హత్యకు గురైన స్పందన చిన్ననాటి మిత్రుడు మనోజ్ అనే వ్యక్తి హత్యకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది.
Also Read : ధర్మవరం టీడీపీ-BJP విభేదాలు: పరిటాల శ్రీరామ్ వివరణ
కేసు చేధన విధానం
పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు. ఫోన్ డాటా ఆధారంగా కేసును చేధించే క్రమంలో, నిందితుడు మనోజ్ తన నేరాన్ని ఒప్పుకున్నాడు. ఆయన స్పందనపై విచక్షణ రహితంగా స్క్రూ డ్రైవర్‌తో దాడి చేసి హత్యకు పాల్పడ్డట్లు వెల్లడించారు. సీసీ కెమెరాలు, ఫోన్ కాల్ రికార్డులు ఆధారంగా పోలీసులు హత్యకేసును చేధించారని తెలిపారు. ప్రస్తుతం మనోజ్ పోలీసుల అదుపులో ఉన్నాడు.
పోలీసుల విజ్ఞప్తి
పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ, వ్యక్తిగత సమస్యలను చట్టబద్ధంగా పరిష్కరించుకోవాలని, ఎటువంటి హింసాత్మక చర్యలకు దిగకూడదని సూచించారు. ఈ ఘటన అందరికీ ఒక గుణపాఠం అవుతుందని పేర్కొన్నారు.