టీడీపీ అధినేత చంద్రబాబు ఆదేశాలతోనే స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ జరిగిందని ఏపీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ ఆరోపించారు. ఆయన చేసిన స్కాం జనసేనాని పవన్ కల్యాణ్ కు, రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరికి కనిపించలేదా? అని ప్రశ్నించారు. తన చేతికి వాచ్ కూడా లేదని చెప్పుకునే చంద్రబాబు కోట్ల రూపాయల ఫీజులు చెల్లించి లాయర్లను ఎలా పెట్టుకున్నారని ప్రశ్నించారు. చంద్రబాబు సానుభూతి కోసం ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. కక్ష సాధించాల్సిన అవసరం వైసీపీకి లేదని… కక్ష సాధించాలనుకుంటే ఇంత కాలం ఆగేవాళ్లం కాదని చెప్పారు. సీఐడీ విచారణలో అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని తెలిపారు. 

Previous articleపవన్ కల్యాణ్, నాదెండ్లను అదుపులోకి తీసుకుని మంగళగిరిలో జనసేన కార్యాలయం వద్ద విడిచిపెట్టిన పోలీసులు
Next articleబింబిసార దర్శకుడితో చిరంజీవి సోషియో ఫాంటసీ చిత్రం… ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభం