టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు రాజమండ్రి జైలు నుంచి విడుదలైన అనంతరం పార్టీ శ్రేణులు, తెలుగు ప్రజలు, తనకు మద్దతుగా నిలిచిన రాజకీయ పక్షాలను ఉద్దేశించి ప్రసంగించారు. మీడియాకు కూడా ధన్యవాదాలు తెలిపారు. కొంచెం బలహీనంగా కనిపించిన చంద్రబాబు దగ్గుతూనే మాట్లాడారు. “తెలుగు ప్రజలందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు తెలియజేసుకుంటున్నా. ఇవాళ నేను కష్టంలో ఉన్నప్పుడు మీరందరూ 52 రోజులుగా ఎక్కడికక్కడ రోడ్లపైకి వచ్చి మీరు సంఘీభావం తెలియజేశారు, పూజలు చేశారు, నా కోసం ప్రార్థనలు చేశారు. మీరు చూపించిన అభిమానం నా జీవితంలో మర్చిపోలేను. వారందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అదే సమయంలో, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోనే కాకుండా దేశవిదేశాల్లో నా కోసం మీరు పడిన తాపత్రయం ఎప్పటికీ గుర్తుంచుకుంటాను. ఆ రోజున నేను చేసిన అభివృద్ధి పనులను కూడా మీరు ఎక్కడికక్కడ చాటి చెబుతూ రోడ్లపైకి వచ్చి నాకు సంఘీభావం తెలిపారు. నేను చేసిన పనులు మీకు ఏ విధంగా ఉపయోగపడ్డాయో, సమాజానికి ఏ విధంగా ఉపయోగపడ్డాయో అందరికీ తెలియజెప్పారు. దీంతో నా జన్మ ధన్యమైందని భావిస్తున్నాను. ఇలాంటి అనుభూతి ఏ నాయకుడికి రాదు. 

Previous articleఈ దేశం మీది… ఈ రాష్ట్రం మీది…: యువతకు కేసీఆర్ పిలుపు
Next article మనవడు దేవాన్ష్ ను చూసి వెలిగిపోయిన చంద్రబాబు ముఖం…