ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు హైదరాబాద్‌కు చేరుకున్నారు. బేగంపేట విమానాశ్రయంలో ఆయనకు తెలంగాణ టీడీపీ నేతలు ఘన స్వాగతం పలికారు. కారులో నుంచి పార్టీ నేతలు, కార్యకర్తలకు ఆయన అభివాదం చేశారు. బేగంపేట నుంచి జూబ్లీహిల్స్‌లోని తన నివాసం వరకు అభిమానులతో ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఢిల్లీ పర్యటన ముగియడంతో ఆయన నేరుగా హైదరాబాద్ చేరుకున్నారు. రేపు సాయంత్రం 4 గంటలకు ప్రజా భవన్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఆయన సమావేశం కానున్నారు. హైదరాబాద్ నగరమంతా చంద్రబాబుకు ఆహ్వానం పలుకుతూ టీడీపీ నేతలు ఫ్లెక్సీలు, కటౌట్‌లు ఏర్పాటు చేశారు.