స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్టయిన టీడీపీ అధినేత చంద్రబాబు 52 రోజుల రిమాండ్ తర్వాత నేడు బయటికి వచ్చారు. ఆయనకు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ ఏపీ హైకోర్టు నేడు తీర్పునిచ్చింది. కోర్టు తీర్పు నేపథ్యంలో, చంద్రబాబు రాజమండ్రి జైలు నుంచి విడుదలయ్యారు.  కాగా, చంద్రబాబు విడుదల అవుతున్న విషయం తెలుసుకుని కుటుంబ సభ్యులు కూడా జైలు వద్దకు వచ్చారు. నందమూరి బాలకృష్ణ, నారా బ్రాహ్మణి, మనవడు దేవాన్ష్ జైలు గేటు వద్ద చంద్రబాబు కోసం వేచిచూశారు. భారీ జనసందోహం నడుమ నడుచుకుంటూ వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు మనవడు దేవాన్ష్ ను చూసి పట్టలేని ఆనందం వ్యక్తం చేశారు. ఆయనలో వాత్సల్యం కట్టలు తెంచుకుంది. దేవాన్ష్ ను ఎంతో ఆపేక్షతో దగ్గరకు తీసుకుని హత్తుకున్నారు. మనవడి బుగ్గలు చిదుముతూ ముద్దు చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలను టీడీపీ తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకుంది.