ఈసారి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రముఖ నేతలతో పాటు అత్యధికంగా వినిపించిన పేరు బర్రెలక్క. ఆమె అసలు పేరు కర్నె శిరీష. ఉద్యోగం రాకపోవడంతో బర్రెలు కాస్తున్నానంటూ ఆమె చేసిన ఓ వీడియోతో పాప్యులారిటీ రావడమే కాదు, బర్రెలక్క అనే పేరు లభించింది. 

బర్రెలక్క తెలంగాణ ఎన్నికల్లో కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసింది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో ముందంజ వేసిన ఈ యువతి… ఈవీఎం ఓట్ల లెక్కింపునకు వచ్చేసరికి డీలాపడిపోయింది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలో మూడు రౌండ్ల ఓట్ల లెక్కింపు అనంతరం కేవలం 983 ఓట్లు మాత్రమే పొందింది. ప్రస్తుతం ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆధిక్యంలో కొనసాగుతున్నారు.