మాదాపూర్ డివిజన్ పరిధిలోని  మాదాపూర్ లో గల సున్నం చెరువు కబ్జాకు గురి అవుతున్న విషయం తెలుసుకోని ఇరిగేషన్  ,రెవెన్యూ, జిహెచ్ఎంసి, టౌన్ ప్లానింగ్ అధికారులతో కలిసి శేరిలింగంపల్లి  ఎమ్మెల్యే  ఆరెకపూడి గాంధీ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ  మాట్లాడుతూ సున్నం చెరువు పరిధిలోని ఎఫ్ టి ఎల్, బఫర్ జోన్ లో Sy. No 16 లో  మట్టి తో పూడ్చి అక్రమంగా ప్రహరి గోడలు నిర్మించి, అక్రమ కట్టడాలు చేస్తున్న భూ కబ్జాదారుల పై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని తక్షణ చర్యలు తీసుకొని  చెరువును పరిరక్షించాలని ఆన్నారు. రెవెన్యూ ,ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యంతో చెరువు కబ్జాకు గురి అవుతుందని,ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  గతంలో పార్లమెంట్ సభ్యుని గా ప్రతిపక్ష నేత గా ఉన్న  సమయంలో చెరువు ను సందర్శించి, చెరువు కబ్జాల నుండి కాపాడాలని కఠిన చర్యలు తీసుకోవాలని కోరగా నేటి వరకు అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం శోచనీయం అని, భూకబ్జాదారులు పెట్రేగిపోతున్నారని  కావున భూ కబ్జాదారుల పై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. చెరువు ను పరిరక్షించాలని ,చెరువులను సంరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిదని , కబ్జాలకు పాల్పడుతున్న ఎంతటి  వారైన ఉపేక్షించే ప్రసక్తే లేదని ఎమ్మెల్యే గాంధీ  తెలియచేసారు. సున్నం చెరువు ఎఫ్టీఎల్ పరిదిలో జరుగుతున్న నిర్మాణాలను వెంటనే కూల్చి వేయాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్, ఇరిగేషన్ సీఈ, సైబరాబాద్ సీపీ లకు లేక రాశారు. భూకబ్జాదారులు తప్పుడు పత్రాలతో కబ్జా లకు పాల్పడుతున్నారని గత ప్రభుత్వం ఉన్నప్పుడు చెరువులకు ఫెన్సింగ్ లు వేసి కాపాడిన జైహింద్ రెడ్డి అనే వ్యక్తి తప్పుడు పత్రాలతో చెరువు ను కబ్జా చేశారని  భూకబ్జా దారుల పై కఠిన చర్యలు తీసుకోవాలి అని ఎమ్మెల్యే గాంధీ గారు తెలియచేసారు.

చెరువును గతంలో మట్టి తో పూడ్చినప్పుడు అప్పటి MRO ,అధికారులు అందరూ కలిసి పూడ్చిన మట్టిని జెసిబిల సహాయం తో తీసివేసి చెరువును పరిరక్షించామని,  ఎన్నికల సమయంలో ఇదే అదునుగా భావించి కబ్జాదారుల ప్రహరి గోడలు ,చెట్లు పెంచడం ,నిర్మాణం పనులు చెప్పటి చెరువును కబ్జా చేయడం జరిగినదని  అప్పట్లో రోడ్డు వేయడానికి ఇరిగేషన్ అధికారులు అనుమతి ఇవ్వలేదు కానీ ఇపుడు ఏకంగా చేరువునే పూడ్చివేయడానికి అనుమతి ఎలా ఇచ్చారు అని అధికారులను అడుగుతున్నానని ఎమ్మెల్యే గాంధీ గారు పేర్కొన్నారు. చెరువులను కాపాడాల్సిన వారే   బక్షిస్తే ఎట్లా అని, చెరువులు కాల్వలు, నాళాలు పూడ్చుకుంటు పోతే భవిష్యత్తులో నీటి సమస్య తలెత్తుతుందని ,ప్రజలకు తీవ్ర అన్యాయం చేసిన వారిమి అవుతామని, బాధ్యతతో చెరువులను సంరక్షించాలని , ఇది మన అందరి బాధ్యత అని ,ఫెన్సింగ్ ఉన్న, హద్దులను తొలగించి యథేచ్ఛగా చేరువు ను మట్టి తో నింపి కబ్జాకు పాల్పడినరని  ఎమ్మెల్యే గాంధీ  తెలియచేసారు. సున్నం చెరువు  కబ్జాకు పాల్పడిన ఎంతటి వారైనా ఉపేక్షించే ప్రసక్తి లేదని ,కఠిన చర్యలను తీసుకుంటామని ఎమ్మెల్యే గాంధీ  అన్నారు. ఇకనైనా అధికారులు మేల్కొని అక్రమ కట్టడాలు కూల్చివేసి చెరువును యథాస్థితికి తీసుకురావాలని చెరువును పూర్తి స్థాయిలో పునరుద్ధరించి చెరువు చుట్టూ ఫెన్సిగ్ వేసి చెరువు మళ్ళీ కబ్జాకు గురి కాకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే గాంధీ అధికారులకు తెలియచేసారు.

ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ డి ఈ నరేందర్, ఏ ఈ లక్ష్మీ నారాయణ , రెవెన్యూ ఇన్ఫెక్టర్ శ్రీనివాస్, టౌన్ ప్లానింగ్ ఏసీపీ రాజ్ కుమార్ , జిహెచ్ఎంసి అధికారులు డి ఈ ఆనంద్ , ఏ ఈ రంజిత్ మరియు  మాదాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు సహదేవ్ , సాయి, హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.