ఏపీలో ఎన్నికలు ముగియగానే అప్పటివరకు ఎన్నికల ప్రచారంలో బిజీ బిజీ గా ఉన్న నేతలు రిలాక్స్ మోడ్ లోకి వెళ్లిన సంగతి తెలిసిందే. కొందరు విదేశాలకు వెళ్తే మరికొందరు పుణ్యక్షేత్రాలు తిరుగుతుంటే ఇంకొందరు తమ వ్యాపారాలతో బిజీ గా ఉన్నారు. అయితే కౌంటింగ్ సమయం దగ్గర పడుతుండటంతో ఇప్పుడు అందరూ అలెర్ట్ అవుతున్నారు. కాగా ఏపీలో ఎన్నికల రోజు హింసాత్మక ఫటనలు చెలరేగిన నేపథ్యంలో కౌంటింగ్ రోజు ఎలా ఉండబోతోందో అని అందరిలో టెన్షన్ మొదలైంది. ఈసారి ఏపీ ఎన్నికల్లో ప్రధాన పార్టీలైన కూటమి , వైసీపీ మధ్య గట్టి పోటీ నెలకొంది. గెలుపు పై ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తుండగా ప్రజల తీర్పు ఎలా ఉండబోతోంది అనేది జూన్ 4 న తెలియనుంది. కాగా ఎన్నికలు ముగియగానే జగన్ లండన్ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే .. ఆయన జూన్ ఒకటిన తిరిగి రానున్నట్టు సమాచారం. ఇక టీడీపీ అధినేత చంద్రబాబు కూడా తన కుటుంబ సమేతంగా అమెరికా పర్యటనలో ఉండగా జూన్ 1వ తేదీన అమరావతికి రానున్నారు. అమరావతి నుండే టీడీపీ నేతలతో కలిసి ఎన్నికల ఫలితాలు వీక్షిoక్షనున్నట్టు తెలుస్తోంది. ఇక పోలింగ్ తర్వాత జన సేనాని పవన్ కళ్యాణ్ కూడా విశ్రాంతి లో ఉన్న పవన్ కూడా జూన్ 1 న అమరావతి చేరుకోనున్నట్టు సమాచారం. ఎన్నికల తర్వాత హైదరాబాద్ లో విశ్రాంతి తీసుకుంటున్న పురందరేశ్వరి కూడా జూన్ 3 న రాజమండ్రి వెళ్లనున్నట్టు తెలుస్తోంది. అలాగే రెస్ట్ మోడ్ లో ఉన్న వై ఎస్ షర్మిల కూడా జూన్ మూడున కడప చేరుకొని అక్కడినుండి ఎన్నికల ఫలితాలు వీక్షించనున్నారు. అయితే ఈసారి ఏపీలో ఎన్నికలు హోరా హోరీగా జరిగిన నేపథ్యంలో ఆయా పార్టీల నేతలు , కార్యకర్తలు ఫలితం కోసం టెన్సన్ గా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు అందరి ద్రుష్టి ఏపీ ఎన్నికల ఫలితాల పైనే ఉంది. ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గం పై దేశ వ్యాప్తంగా ఆసక్తి నెలకొందని చెప్పాలి. కాగా అన్నింటికీ సమాధానం జూన్ 4 న రానుంది.