తమ డిమాండ్ల సాధన కోసం ఏపీలో అంగన్వాడీలు గత రెండు వారాలుగా సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా, రాష్ట్ర ప్రభుత్వం తమ డిమాండ్లను పట్టించుకోవడంలేదంటూ అంగన్వాడీ కార్యకర్తలు, సహాయ సిబ్బంది ఓ కొండముచ్చు కోతికి వినతిపత్రం సమర్పించారు. 

సీఐటీయూ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమ్మె కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో అంగన్వాడీలు పాల్గొన్నారు.  ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన ఓ కొండముచ్చుకు వినతిపత్రం అందించారు. ఓ అంగన్వాడీ నేత ఇచ్చిన వినతిపత్రాన్ని ఆ కొండముచ్చు అందుకోవడంతో అందరూ చప్పట్లు కొట్టారు. 

దీనికి సంబంధించిన వీడియోను తెలుగుదేశం పార్టీ తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకుంది. జగన్ ఎలాగూ పట్టించుకోవడంలేదని, అంగన్వాడీలు కొండముచ్చుకు వినతిపత్రం అందజేశారని పేర్కొంది.