BigBoss 8: తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ రియాల్టీ షో విజయవంతంగా 8వ సీజన్ జరుపుకుంటోంది. గత రెండు వారాలుగా రెండు ఎలిమినేషన్లు జరిగాయి, కాగా మూడో వారంలో అభయ్ నవీన్ ఎలిమినేట్ అయ్యారు. అయితే అభయ్ నవీన్ ఎలిమినేషన్‌కు ప్రధాన కారణం అతని వ్యవహారం అని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
నోరుపారేసుకోవడమే కారణం…
బిగ్ బాస్ ఆటలో భాగమో లేక వ్యూహంలో భాగమో అనిపించినా, అభయ్ నవీన్ బిగ్ బాస్ షో పైనే సైటైర్లు వేస్తూ, దురుసుగా మాట్లాడటం వల్ల తనకు సమస్యలు ఎదురయ్యాయి. హోస్ట్ నాగార్జున కూడా అభయ్‌ను అనేక సందర్భాలలో హెచ్చరించారు. అయితే అభిమానుల నుంచి వచ్చిన ఓట్లు తక్కువ కావడంతో, అభయ్ మూడో వారంలో షో నుంచి ఎలిమినేట్ అయ్యారు.
BigBoss 8 అభిమానులకు క్షమాపణలు…
ఎలిమినేషన్ అనంతరం, అభయ్ నవీన్ తన అభిమానులకు క్షమాపణలు చెప్పారు. రెండు వారాల పాటు తనను మద్దతు ఇచ్చిన వారందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. తన వ్యాఖ్యలు, వ్యవహారంపై అభిమానులను బాధపెట్టినందుకు క్షమాపణలు కోరారు. ‘‘మీ అభిమానానికి మరింత దగ్గరగా ఉంటా, సినిమాల ద్వారా మిమ్మల్ని మరింత అలరిస్తా’’ అని వీడియోలో పేర్కొన్నారు.
మితిమీరితే శిక్ష తప్పదు
రియాల్టీ షోల్లో ప్రతి కంటెస్టెంట్‌కు తనకంటూ ఒక స్ట్రాటజీ ఉంటుంది. అయితే ఆ స్ట్రాటజీలో మితిమీరిన కాన్ఫిడెన్సు ఒక్కోసారి శిక్షకు దారి తీస్తుంది. అభయ్ కూడా తన ఓవర్ యాక్షన్, దురుసు ప్రవర్తనతో ఎలిమినేట్ అయ్యాడని చాలామంది అభిప్రాయపడుతున్నారు.
బిగ్ బాస్ పై తిట్లు
గతవారం గుడ్లు టాస్క్ సందర్భంగా అభయ్ నవీన్ తన జట్టు గెలుపు కోసం పోరాడినా, కొన్ని సందర్భాల్లో బిగ్ బాస్ పై అనవసరంగా ప్రతాపం చూపాడు. ఇలాంటి ఘటనల్లో బూతులు వాడటం కూడా అతని ఎలిమినేషన్‌కు కారణంగా కనిపిస్తోంది.