వారాహి విజయ యాత్ర రెండవ విడతలో భాగంగా ఏలూరు లో నిర్వహించిన బహిరంగ సభలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ పై నిప్పులు చెరిగారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. లక్షల కోట్లు దోచుకున్న జగన్ ప్రభుత్వ అవినీతిని సాక్షాత్తు కాగ్సమ్తే వెలుగెత్తి చూపించింది అన్నారు. రాష్ట్రంలో మహిళల అదృశ్యాలకు వాలంటీర్లే కారణమని వైసిపి పాలనలో అదృశ్యమైన 30 వేల మందిలో 14,000 మంది ఆచూకీ ఇప్పటికీ తెలియలేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

రాష్ట్రంలో మానవ అక్రమ రవాణా జరుగుతుందని కేంద్ర నిగావర్గాలే హెచ్చరించాయి వైసీపీ తీసుకువచ్చిన వాలంటరీ దేవస్థానం సేకరిస్తున్న ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని సంఘవిద్రోహశక్తులకు చార్వేస్తున్నారు అని ఆరోపించారు. అదే సమయంలో కాగ్ ప్రశ్నలకు సమాధానమేది అంటూ 10 లక్షల కోట్ల ఖజానా దేనికోసం ఖర్చు చేశారు అని నిలదీశారు. గత సంవత్సరం ప్రభుత్వం చేసిన ఖర్చులపై కాగ్ నివేదికలో అక్రమాలన్నీ బయటపడ్డాయని రాష్ట్రంలో చేసే ఖర్చులు ఎవరికి తెలియకుండా ప్రభుత్వం దోపిడీకి తెరతిస్తుందని ఆరోపించారు. నన్ను నాన్ రెసిడెన్షియల్ నాయకుడు అంటున్నారు నిజమే నా తండ్రి జగన్ తండ్రి సీఎం కాదు ఆయనలా ప్రతి పనికి ఆరు శాతం కమిషన్ తీసుకునే పరిస్థితి లేదు అని విమర్శించారు. నేను సినిమాలు తీసి వచ్చిన డబ్బులు కష్టాల్లో ఉన్న రైతులకు పంచుతున్నాను. నువ్వు ఎప్పుడైనా ప్రజల వద్దకు వచ్చావా అంటూ విమర్శలు గుప్పించారు. అలా రానప్పుడు దాచేపల్లిలో ఉంటేనేమి తాడేపల్లి లో ఉంటేనేమి అంటూ మండిపడ్డారు పవన్ కళ్యాణ్. అలాగే నేను సమాజాభివృద్ధి గురించి మాట్లాడుతుంటే జగన్ మాత్రం సభ్యత లేకుండా తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడి కించపరుస్తున్నారని ధ్వజమెత్తారు. తనకి రాజకీయాలు అవసరం లేదు కానీ దగా పడుతున్న ప్రజల కోసం రాజకీయాల్లోకి వచ్చినట్లు తెలిపారు. ఇంత దిగజారి వ్యక్తిత్వ జీవితాల గురించి మాట్లాడే జగను నేను ఇకనుంచి ఏకవచనం తోనే మాట్లాడుతాను అంటూ తన ఆవేశాన్ని వెళ్ళగక్కారు. వాలంటీర్లపై పవన్ చేస్తున్న ఈ విమర్శలు జనసేనకు నష్టాన్ని కలిగిస్తాయేమో అని అభిప్రాయపడుతున్నారు రాజకీయ నిపుణులు.