శేరిలింగంపల్లి మాదాపూర్ పవర్ ఆఫ్ జర్నలిజం న్యూస్ ;
శనివారం రోజు మాదాపూర్ డివిజన్ పరిధిలో గల సాయి నగర్ స్వాతి హైస్కూల్ నందు అపోలో హాస్పిటల్స్, జూబ్లీహిల్స్ వారి సౌజన్యంతో ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ ఆధ్వర్యంలో ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో ఎత్తు, బరువు, రక్తపోటు, షుగర్, పల్స్, కంటి, దంత, వినికిడి పరీక్షలతో పాటు ఈ.సీ.జీ. మొదలగు పరీక్షలు నిర్వహించారు. వైద్యులు
డాక్టర్ ఫయాజ్ జనరల్ ఫిజిషన్ , వినయ్ ఆప్తమాలజిస్ట్, డాక్టర్ సంతోష్ డెంటల్ , ధరమేందర్ ఆడియో మెట్రిక్ మొదలగు వారు వైద్య సేవలు అందించారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ. మారిన జీవనశైలిలో పర్యావరణంలో వస్తున్న అనేక మార్పులవల్ల అనేక వ్యాధులకు గురవుతున్నారు. ఆరోగ్యమే మహాభాగ్యం కావున కొన్ని జాగ్రత్తలు తీసుకున్న యెడల మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుందని తెలిపారు. ప్రతిఒక్కరు నిత్యవ్యాయామం, మెడిటేషన్, యోగ, ధ్యానము, నడక, కనీసం 40 నిమిషాలు చేయాలి. సాధ్యమైనంత వరకు తాజా ఆకుకూరలు, సీజనల్ ఫ్రూట్స్, పాలు, పాలఉత్పత్తులు, చేపలు, గ్రుడ్లు, తృణధాన్యాలు, డ్రై ఫ్రూట్స్ వంటి పౌష్టికాహారం తీసుకొని, ఆరోగ్యం కాపాడుకోవాలని తెలిపారు. సాధ్యమైనంత మేరకు ఆల్కహాల్, పొగాకు, పొగాకు ఉత్పత్తులు, ఇతర మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలని తెలిపారు. అనారోగ్యంగా ఉంటే, అశ్రద్ధ చేయకుండా, వెంటనే వైద్యులను సంప్రదించి, వారి సూచనలు, సలహాలు పాటించి ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాలని సూచించారు. మన తీసుకొనే ఆహారం సమయపాలన పాటించాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు V. ఫణి కుమార్, విష్ణు ప్రసాద్, జనార్ధన్, వాని సాంబశివరావు, కొండా శ్రీనివాసరావు, రోటరీ క్లబ్ అధ్యక్షురాలు శశిరేఖ, పాకాలపాటి శ్రీనివాస్ మరియు హాస్పిటల్ ప్రతినిధి శ్రీ అజిత్ త్రిపాఠి తదితరులు పాల్గొన్నారు. ఈ శిబిరంలో 102 మందికి వైద్యసేవలు అందించారు.