Breaking News

Politics

గ్రామాల్లో మూఢనమ్మకాలు… రాజ్యమేలుతూనే ఉన్నాయి

11hyd-state17a

సాంకేతికంగా ప్రపంచం ముందుకెళ్తున్న ప్రస్తుత కాలంలోను గ్రామాల్లో మూఢనమ్మకాలు రాజ్యమేలుతూనే ఉన్నాయి. కుక్కకాటుకు చికిత్సకు ఆసుపత్రికి వెళ్లకుండా గ్రామీణులు ఇప్పటికీ నాటు వైద్య పద్ధతులనే ఆశ్రయిస్తూ ఇబ్బందుల పాలవుతున్నారు. కొన్ని సందర్భాల్లో ప్రాణాల మీదకూ తెచ్చుకుంటున్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లా దేవరకద్ర మండలం కౌకుంట్ల గ్రామ పరిధిలో ఈ నాటువైద్యం కొన్నేళ్లుగా కొనసాగుతోంది. దీనిలోభాగంగా.. కుక్క కరిచిన ఓ యువకుడిని మండుటెండలో కూర్చోబెట్టి, వీపుభాగంలో తాంబాళం (పెద్ద ఇత్తడి పళ్లెం) ఉంచుతారు. తాంబాళం దానంతటదే కిందపడేవరకు సుమారు గంట నుంచి 3 గంటల వరకు నడుంవంచి …

Read More »

మియాపూర్ లో… ఇంటర్ విద్యార్ధినిని హత్య చేసి గుట్టల్లో పడేసిన దుండగలు-

-

మియాపూర్‌ మదీనాగూడలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. ఇంటర్‌ విద్యార్థినిని దుండగులు దారణంగా హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని కొండల్లో పడేశారు. అమీన్‌పూర్‌ సమీపంలోని కొండల్లో విద్యార్థిని మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. విద్యార్థినిని బాచుపల్లిలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్‌ రెండో సంవత్సరం చదువుతున్న చాందిని జైన్‌గా గుర్తించారు. ఈ నెల 9న ఇంటి నుంచి వెళ్లిన చాందిని తిరిగిరాలేదు. సైబరాబాద్‌ సంయుక్త పోలీసు కమిషనర్‌ ఘటనాస్థలిని పరిశీలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్లాన్ ప్రకారమే హత్య.. …

Read More »

దేశాన్ని పరిశుభ్రంగా ఉంచినవారే.. భరతమాతకు నిజమైన బిడ్డలు- మోదీ

11brk-69

ప్రధానమంత్రి నరేంద్రమోదీ మాట్లాడుతూ నిత్య జీవితంలో పరిశుభ్రత ముఖ్యమైన భాగమని అన్నారు. అందుకే దేవాలయాల కన్నా ముందు మరుగుదొడ్లు నిర్మించాలని పిలుపునిచ్చారు. స్వామి వివేకానంద చికాగోలో ప్రసంగించి నేటికి 125ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా ‘యువ భారత్‌, నవభారత్‌’ పేరుతో ప్రధాని మోదీ ప్రసంగించారు.‘ఈ రోజు సెప్టెంబర్‌ 11. అంటే 2001లో అమెరికాపై దాడులు జరిగిన రోజు. అయితే అంతకన్నా ముందు సెప్టెంబర్‌ 11 అంటే మనకు వివేకానందుడు గుర్తొస్తారు. 1893లో ఇదే రోజున స్వామి వివేకానంద చికాగోలో ప్రసంగించారు. సామాజిక రుగ్మతల గురించి …

Read More »

కళ్లు తెరవకముందే శిశువు మరణం… బల్లపైనే ప్రసవం

8brk-48

ఈ లోకంలోకి వచ్చిన నవజాత శిశువులు తల్లి గర్భాన్ని వీడి కళ్లైనా తెరవకముందే మృత్యువాత పడ్డారు. ఆధునిక వైద్య సదుపాయాలన్నీ ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలోనే ఈ ఘటనలు చోటుచేసుకోవడం విచారకరం. సకాలంలో వైద్యసేవలు అందకపోవడంతోనే ఆ పసికందులు మరణించాడు. కేవలం వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యమే ఈ మరణాలకు దారి తీసిందంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మం జిల్లా కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో గంటల వ్యవధిలోనే ఇద్దరు శిశువులు మృతిచెందిన ఉదంతాలు సంచలనం సృష్టించాయి. శనివారం రాత్రి, ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఈ …

Read More »

కర్ణాటకలో తెలుగు విధ్యార్డులపై దాడులు చేస్తే సహించేది లేదు….. చంద్రబాబు!

break84-babu

సీరియస్‌గా తీసుకున్నారు. తెలుగు విద్యార్థులపై దాడులు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఈ ఘటనపై కేంద్రంతో మాట్లాడతానని మంత్రులకు సీఎం చెప్పారు. అవసరమైతే కర్ణాటక ముఖ్యమంత్రితోనూ చర్చిస్తానని తెలిపారు. ఈ ఘటనపై వెంటనే కర్ణాటక సీఎస్‌తో మాట్లాడాలని సీఎంవో అధికారులను ఆదేశించారు. దీంతో ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీశ్‌చంద్ర కర్ణాటక సీఎస్‌తో మాట్లాడారు. రేపు, ఎల్లుండి జరిగే పరీక్షల్లో తెలుగు విద్యార్థులకు రక్షణ కల్పించాలని కోరారు. సీఎం అధ్యక్షతన కొనసాగుతున్న తెదేపా సమన్వయ కమిటీ సమావేశంలో కర్ణాటక ఘటనను మంత్రులు సీఎం దృష్టికి …

Read More »

హిందూ దేవతలను అవమానిస్తూ ఇచ్చిన ప్రకటనపై… కేసు నమోదు!

8brk113a

హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ప్రకటన ఇచ్చారన్న ఆరోపణలపై ప్రముఖ హెయిర్‌ స్టైయిలిస్ట్‌ జావెద్‌ హబీబ్‌పై హైదరాబాద్‌లో కేసు నమోదైంది. కరుణాసాగర్‌ అనే న్యాయవాది ఇచ్చిన ఫిర్యాదుతో హబీబ్‌పై కేసు నమోదు చేసినట్లు సైదాబాద్‌ పోలీసులు తెలిపారు. దీనిపై ప్రశ్నించేందుకు ఆయనకు త్వరలోనే నోటీసులు జారీ చేస్తామని.. న్యాయ నిపుణుల సలహా తీసుకుని ఈ అంశంలో ముందుకెళతామని పేర్కొన్నారు.కరుణాసాగర్‌ సోషల్‌మీడియాలో బ్రౌజ్‌ చేస్తున్న సమయంలో ఈ ప్రకటనను గుర్తించారు. ‘దేవతలు కూడా జేహెచ్‌ సెలూన్‌కు వస్తారు’ అని ఆ ప్రకటనలో ఉందని, ఇది దేవతలను అవమానపరచడమేనని …

Read More »

రాష్ట్రాభివృద్ధి కోసం రాత్రింబవళ్లు పనిచేస్తున్నాను… “పేదవాడికి అండగా ఉండడమే జీవితాశయం”-చంద్రబాబు

08brk-cbn-knl

  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు  బహిరంగ సభలో మాట్లాడుతూ ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని పేర్కొన్నారు. పేదవాడికి అండగా ఉండడమే తన జీవితాశయమని తెలిపారు. కర్నూలు జిల్లా ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించిన అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్రాభివృద్ధి కోసం రాత్రింబవళ్లు పనిచేస్తున్నానని, ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా వెనుకాడేది లేదని స్పష్టంచేశారు. రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు.సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టానని, పేదరికం లేని సమాజం కోసం కృషి చేస్తున్నానని సీఎం వెల్లడిచేసారు. నన్ను నమ్ముకున్న ప్రజల …

Read More »

ముఖ్యమంత్రి కెసిఆర్ ను చూసి కిలకిలమని నవ్వుతున్న M.P కవిత…

WhatsApp Image 2017-09-08 at 11.45.26 AM

తెలంగాణ సీఎం కేసీఆర్‌కు బుధవారం డాక్టర్‌ సచ్‌దేవ్‌ నేతృత్వంలోని వైద్యుల బృందం కంటి శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేసింది. ఈ విషయాన్ని సీఎం తనయుడు ఐటీ, మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ ట్విట్టర్‌ ద్వారా తెలియజేశారు. ‘గౌరవ ముఖ్యమంత్రి కుడి కన్నులోని కాట్రాక్ట్‌ ఆపరేషన్‌ విజయవంతమైంది. డాక్టర్‌ సచ్‌దేవ్‌కు ధన్యవాదాలు’ అంటూ ట్వీట్‌ చేశారు.ఈ ఆపరేషన్‌ కోసం సీఎం గత శుక్రవారం( సెప్టెంబర్‌ 1న) ఢిల్లీకి వెళ్లారు. శనివారం కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్‌జైట్లీని కలిశారు. ఆదివారం నుంచి మూడు రోజుల పాటు విశ్రాంతి …

Read More »

అన్నిటికంటే ముఖ్యమైన పండుగ ‘జలసిరికి హారతి’-చంద్రబాబు!

6brk105a

‘జలసిరికి హారతి’ అన్ని పండుగల కంటే ముఖ్యమైన పండుగ అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. విశాఖ జిల్లా కశింకోట మండలం నర్సాపురం గ్రామంలో ‘జలసిరికి హారతి’ కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టారు.  శారదా నదికి హారతి ఇచ్చిన ముఖ్యమంత్రి.. నర్సాపురం ఆనకట్టను ఈ సందర్బంగా ప్రారంభించారు.తదనంతరం బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడుతూ… మన జీవితాలకు వెలుగులు తెచ్చే పండుగ ‘జలసిరికి హారతి’ తెలిపారు. మన జీవన ప్రమాణాలు సక్రమంగా ఉండాలంటే ప్రకృతిని ఆరాధించాలి. మనకు తిండినిచ్చే రైతులను గౌరవించడం మనందరి బాధ్యత. ఎన్నికల్లో ఇచ్చిన …

Read More »

విజయవాడలో పర్యటించనున్న ముఖ్యమంత్రి – కేసిర్

6brk98a

ఆంధ్రప్రదేశ్‌ తాత్కాలిక రాజధాని విజయవాడలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈనెల 27న పర్యటించనున్నారు. తెలంగాణ మొక్కులు చెల్లించుకుంటున్న కేసీఆర్‌ ఈనెల 27న విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకుని ముక్కుపుడక సమర్పించనున్నారు. కేసీఆర్‌ ఇప్పటి వరకు వరంగల్‌ భద్రకాళి అమ్మవారికి బంగారు కిరీటం, స్వర్ణపత్రాలు, తిరుమల శ్రీవారికి స్వర్ణ సాలిగ్రామహారం, స్వర్ణ కంఠాభరణాలు, కురవి వీరభద్రుడికి బంగారు మీసం సమర్పించిన సంగతి విదితమే. తెలంగాణ ఉద్యమం సమయంలో దేవుళ్లకు మొక్కుకున్న మొక్కులను కేసీఆర్‌ వరుసగా తీర్చుకుంటున్నారు.

Read More »