Breaking News

News

అధికారులకు చిక్కిన అవినీతి తిమింగలం!

26ap-main5b

అవినీతి అనకొండ గొల్ల వెంకట రఘు, ఆయన బినామీలు నల్లూరి వెంకట శివప్రసాద్‌, ఆయన భార్య చింతమనేని గాయత్రిలు కటకటాలపాలయ్యారు. వీరిని మంగళవారం అరెస్టు చేసిన ఏసీబీ అధికారులు రఘును విశాఖపట్నంలోనూ…. శివప్రసాద్‌, గాయత్రిలను విజయవాడలోని న్యాయస్థానంలోనూ హాజరుపరిచారు. వీరికి ఆయా న్యాయస్థానాల న్యాయమూర్తులు 14 రోజుల పాటు రిమాండు విధించారు. రఘు, శివప్రసాద్‌లపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసులపై, శివప్రసాద్‌ భార్య గాయత్రిని రఘుకు సంబంధించిన బినామీ ఆస్తులను తన పేరిట కలిగి ఉండటం, వాటిని నిర్వహించడం అభియోగాలపై అరెస్టు చేశారు. ఓ …

Read More »

కబడ్డీ ఆటలో జరిగిన వివాదం వలన బాలుడి మృతి!

26hyd-crime4a

కబడ్డీ ఆటలో రేగిన వివాదానికి ఓబాలుడు బలైన విషాదకర ఘటన శంషాబాద్‌ గ్రామీణ ఠాణా పరిధిలో మంగళవారం జరిగింది. సెలవుల్లో స్నేహితులతో సరదాగా ఆడుకోవడానికి బయటికి వెళ్లిన ఒక్కగానొక్క కుమారుడు విగతజీవిగామారడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. స్థానికులు, పోలీసులు ఈ మేరకు వివరాలు తెలిపారు. శంషాబాద్‌ పరిధిలోని ముచ్చింతల్‌కి చెందిన మీసాల నర్సింహ, జయమ్మ దంపతులకు ఇద్దరు ఆడపిల్లలు, కుమారుడు మల్లికార్జున్‌(14) ఉన్నారు. మల్లికార్జున్‌ పాలమాకుల ఆదర్శ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. ముచ్చింతల్‌ ప్రభుత్వ పాఠశాల మైదానంలో స్నేహితులతో కబడ్డీ ఆడుతుండగా.. తోటి …

Read More »

తన ప్రేమను అంగీకరించలేదని… తండ్రితో కలిసి.!

11

జైపూర్‌(రాజస్థాన్‌): నేను నిన్ను పేమిస్తున్నాను.. పెళ్లి చేసుకుంటానంటూ యువతి వెంట పడ్డాడు ఓ యువకుడు. దీనికి  ఆ యువతి అంగీకరించక పోవడంతో యువకుడు అతని తండ్రి కలిసి ఆమెను సజీవ దహనం చేశారు. ఈ సంఘటన జైపూర్‌ జిల్లా ఇసార్వాల్‌ గ్రామంలో చోటుచేసుకుంది. వివరాలు.. గ్రామానికి చెందిన ఓ యువతి(18) శనివారం సాయంత్రం ఇంటికి వెళ్తుండగా రవి అనే యువకుడు అడ్డుకొని తన ప్రేమను అంగీకరించాలని కోరాడు. దీనికి ఆమె ఒప్పుకోకపోవడంతో చెంపపై కొట్టాడు. ఆ పక్కనే ఉన్న రవి తండ్రి కూడా అక్కడికి …

Read More »

ప్రపంచంలోనే భారీకాయురాలు ఎమాన్‌ అహ్మద్‌ మృతి….

781

ప్రపంచంలోనే అత్యంత భారీకాయురాలు ఎమాన్‌ అహ్మద్‌ కన్నుమూశారు. ఈజిప్ట్‌కు చెందిన ఎమాన్‌ చికిత్స నిమిత్తం 2016లో ముంబయికి తీసుకువచ్చారు. ఇక్కడి సైఫీ ఆస్పత్రిలో కొంతకాలం ఆమెకు చికిత్సను అందించారు. ఆ తర్వాత మెరుగైన చికిత్స నిమిత్తం ఆమెని అబుదాబిలోని బుర్జీల్‌ ఆస్పత్రికి తరలించారు.అక్కడ చికిత్స పొందుతూ సోమవారం తుదిశ్వాస విడిచారు. కిడ్నీ, గుండె సంబంధిత వ్యాధుల కారణంగా ఆమె చనిపోయినట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ముంబయి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నప్పుడు సగం బరువు తగ్గిన ఎమాన్‌ తనంతట తానే తినగలిగే స్థితికి చేరిందని గతంలో …

Read More »

చైనా లో ఘోర ప్రమాదం….మంటల్లో చిక్కుకుని 11 మంది దుర్మరణం:

1280px-Fire-Grand-Rapids-factory

చైనాలో ఘోర ప్రమాదం జరిగింది. జెజియాంగ్‌ ప్రావిన్స్‌లోరెండు నివాస భవనాల్లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో 11 మంది సజీవదహనమయ్యారు. తైజౌ ప్రాంతంలోని రెండు భవనాల్లో అర్ధరాత్రి సమయంలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక అధికారులు గంటల తరబడి శ్రమించి మంటలను అదుపుచేశారు. ఈ ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 12 మంది గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు.సరైన భద్రతా ప్రమాణాలు పాటించకపోవడంతో తైజౌలో …

Read More »

కళ్ళ ముందే కుప్ప కూలిన విమానం… పైలట్‌ మృతి!

25brk-airshow

సముద్ర తీరంలో ఎయిర్‌ షో జరుగుతోంది.. ఆకాశంలో వైమానిక విన్యాసాలు చూసేందుకు అధిక సంఖ్యలో జనం అక్కడకు చేరుకున్నారు. ఇంతలో ఓ విమానం ఒక్కసారిగా సముద్రంలో కుప్పకూలిపోయింది. కళ్లముందే విమానం కూలిపోవడంతో వీక్షకులు ఆందోళనకు గురయ్యారు. ఈ ఘటన ఇటలీలో చోటుచేసుకుంది.ఇటలీ రాజధాని రోమ్‌కు 110 కిలోమీటర్ల దూరంలో టెరాసినా సముద్రతీరంలో ఆదివారం ఎయిర్‌ షో జరిగింది. ఇటలీ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన పలు విమానాలు ఈ ప్రదర్శనలో పాల్గొని విన్యాసాలు చేశాయి. ఈ ఎయిర్‌షోను తిలకించేందుకు వేల సంఖ్య పర్యాటకులు సముద్రతీరానికి చేరుకున్నారు. ఇంతలో …

Read More »

చింత గింజ మింగి 5 ఏళ్ల చిన్నారి మృతి…

pavitra

ఆడుకుంటూ చింతగింజ మింగిన ఓ ఐదేళ్ల చిన్నారి శ్వాస ఆడక మృతి చెందిన విషాద ఘటనిది. జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం కొడవటూర్‌కు చెందిన రాసూరి లక్ష్మి, లింగం దంపతుల కుమార్తె పవిత్ర(5) ఆదివారం సాయంత్రం వారి ఇంటి ఎదుట ఆడుకుంటూ చింతగింజ మింగింది. అది గొంతులో ఇరుక్కుపోవడంతో శ్వాస ఆడక అవస్థలు పడింది. గమనించిన తల్లిదండ్రులు వెంటనే చికిత్స నిమిత్తం చిన్నారిని జనగామ ఏరియా ఆసుపత్రికి, అక్కడి నుంచి హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. అప్పటివరకు సంతోషంగా ఆడుకుంటూ కనిపించిన ఒక్కగానొక్క …

Read More »

మరో సీనియర్ పాత్రికేయుడి దారుణ హత్య…

_8fd3b7a8-a044-11e7-a38e-8ee9fe2ac8e7

కేజే సింగ్‌  సీనియర్‌ పాత్రికేయుడు….ఆయన తల్లి గురుచరణ్‌కౌర్‌లు  తమ నివాసంలో దారుణహత్యకు గురయ్యారు. శనివారం పోలీసులు ఈ విషయాన్ని తెలియచేసారు. అవివాహితుడైన కేజే సింగ్‌ వయసు  64 సంవత్సరాలు కాగా….ఆయన తల్లి 92 సంవత్సరాల పండు వృద్ధురాలు. గుర్తుతెలియని దుండగులు సింగ్‌ను దారుణంగా గొంతుకోసి చంపారు. ఆయన తల్లి ఎంతో కాలం నుంచి మంచంలోనే ఉన్నారు. ఆమెను అక్కడే గొంతు నులిపి చంపినట్లు పోలీసులు వెల్లడించారు. ఇద్దరి మెడలపైనా గాయాలున్నాయి. తలుపుతీయగానే ముందుగా సింగ్‌ను పొట్టలో కత్తితో పొడిచి…ఆ తర్వాత గొంతుకోసి చంపినట్లు తెలుస్తోంది. …

Read More »

సముద్రంలో పడవ మునిగి 4గురు మృతి చెందారు!

Black_Sea_Turkey_Banner

టర్కీ సముద్ర తీరంలో పడవ మునిగి నలుగురు శరణార్థులు మరణించారు. మరో 20 మంది గల్లంతయ్యారు. కోస్టుగార్డు సిబ్బంది మరో 38 మందిని కాపాడారు. శరణార్థులు యూరోపియన్‌ దేశాలకు వెళ్లడానికి ఏజియన్‌ సముద్ర మార్గం కష్టంగా ఉండటంతో వారు నల్ల సముద్రం ద్వారా చేరుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు కోస్టుగార్డులు తెలిపారు. వలసదారులను అడ్డుకోవడానికి యూరోపియన్‌ యూనియన్‌ టర్కీ దేశం గత మార్చిలోనే ఒప్పందం కుదుర్చుకుంది. అయినప్పటికీ వలసలు ఆగటం లేదు.  

Read More »

52 మంది ప్రాణాలను కాపాడిన రియల్ హీరో….. ఫ్రిదా!

22brk85a

గుట్టలుగా పేరుకుపోయిన శిథిలాలు.. నేలకూలిన భవనాలు వాటి కింద ప్రాణాల కోసం పోరాడుతూ చేస్తున్న ఆర్తనాదాలు.. ఇది రెండు రోజులుగా సెంట్రల్‌ మెక్సికోలోని పరిస్థితి. రోజుల వ్యవధిలో రెండు భారీ భూకంపాలు మెక్సికోపై విరుచుకుపడ్డాయి. వందల సంఖ్యలో ప్రజలను పొట్టనబెట్టుకున్నాయి. గత మంగళవారం సంభవించిన భూకంపం కారణంగా వేల సంఖ్యలో భవనాలు కుప్పకూలాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయకసిబ్బంది ప్రాణాలకు తెగించి పోరాడుతున్నారు. వీరికి తనవంతు సాయం చేస్తోంది మెక్సికన్‌ నేవీకి చెందిన జాగిలం ‘ఫ్రిదా’. సహాయ సిబ్బంది కనుగొనలేని పరిస్థితిలో …

Read More »