Breaking News

Latest News

MNP(మొబైల్ నెంబర్ పోర్టబిలిటీ) ఇక జియో సిమ్ కి కూడా..!

అతి తక్కువ ధరకే డేటా ప్యాక్స్, వాయిస్ కాల్స్ ఫ్రీ తో ‘రిలయన్స్ జియో’ సంచలనాలకు తెర లేపిన నేపథ్యంలో తాజాగా ఆ సంస్థ మరొక బంపర్ ఆఫర్ ఇచ్చింది. అదేంటంటే..MNP (మొబైల్ నెంబర్ పోర్టబిలిటీ)ని ప్రవేశపెట్టడం. దీంతో ప్రస్తుతం వాడుతున్న నెంబర్ ను MNP ద్వారా రిలయన్స్ జియోకి మారొచ్చు. జియో సిమ్ కావాలంటే రిలయన్స్ స్టోర్ ల ముందు గంటల తరబడి క్యూ కట్టాలి. కానీ..ఇప్పుడు MNP తో ఆ కష్టాలు తీరిపోయాయి. కొంత మంది ప్రస్తుతం ఉన్న సిమ్ కార్డుని …

Read More »

తవ్వేకొద్ది బయటపడుతున్న దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్‌ సాగర్‌బాబు అవినీతి..

కర్నూలుశ్రీశైలం మాజీ ఈఓ, దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్‌ సాగర్‌బాబు అవినీతి తవ్వేకొద్ది బయటపడుతోంది. ఇప్పటికే విజయవాడ, గుంటూరు, కర్నూలు నగరాల్లో లాకర్లను బయటికి తీసిన ఏసీబీ అధికారులు తాజాగా కర్నూలు నగరంలోని పోస్టాఫీసులోని లాకర్లమీద దృష్టి సారించారు. కర్నూలు పోస్టాఫీసులోని లాకర్లలో కూడా ఆయన భారీగా నగదు ఉంచారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ మేరకు పోస్టాఫీసు అధికారులకు, ఏసీబీ అధికారులు లేఖ కూడా రాసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో వారి నుంచి అనుమతి వచ్చిన వెంటనే ఏసీబీ అధికారులు పోస్టాఫీసులో దాచిన మొత్తాన్ని …

Read More »

‘సుప్రిం’ కష్టాలు..!

న్యాయమూర్తుల కొరత, తగినన్ని ప్రాథమిక వసతుల లేమి, వనరుల లోటు దేశంలో న్యాయ వ్యవస్థను సుదీర్ఘ కాలంగా వేధిస్తున్న సమస్యలు. అయితే, ఇటీవలి కాలంలో న్యాయవ్యవస్థను కలవర పరుస్తున్న ప్రధానాంశం ఏమిటంటే చాలా సాధారణమైన కేసులతో సుప్రీం కోర్టు విలువైన సమయం హరించుకు పోతుండడం. ఆ కేసులు ముఖ్యమైనవేమీ కాకపోయినప్పటికీ ప్రత్యర్థి పార్టీల హక్కులు,  ప్రయోజనాలకు విఘాతం కలుగుతోందంటూ దాఖలవుతున్నాయి. వివిధ ట్రైబ్యునల్స్,  ఉన్నతాధికారుల నుంచి అప్పీళ్లతో పాటు సివిల్,  క్రిమినల్ కేసులు అధిక సంఖ్యలో సుప్రీం కోర్టులో పెండింగ్‌లో ఉన్నాయి. అవి సుప్రీంకోర్టుకు …

Read More »

క్షీణిస్తున్న దావూద్ ఆరోగ్యం

ప్రస్తుతం పాక్ లోని కరాచీలో నివాసముంటున్న దావూద్ ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే తనకు పొంచి ఉన్న ప్రమాదాన్ని గమనించిన దావూద్.. ఆరు బుల్లెట్ ప్రూఫ్ క్రూయిజ్ కార్లను దుబాయ్ నుంచి తెప్పించుకున్నట్లు సమాచారం. షేక్ ఇస్మాయిల్ అనే మారుపేరుతో దావూద్ ప్రస్తుతం తన వ్యాపారాలు నిర్వహిస్తున్నాడు. సెక్యూరిటీ కారణాల రీత్యా ఫోన్లు కూడా లిఫ్ట్ చేయడం మానేశాడు దావూద్. ప్రస్తుతం దావూద్ ఫోన్ కాల్స్ అన్నీ దావూద్ భార్యనే లిఫ్ట్ చేస్తున్నట్లు సమాచారం.  

Read More »

తుని విధ్వంసం ఘటనలో 20 మందికి నోటీసులు

తూర్పుగోదావరి జిల్లా తుని విధ్వంసం ఘటనలో తాజాగా మరో 20 మందికి సీఐడీ నోటీసులు జారీ చేసింది.  వైకాపా నేత భూమన కరుణాకర్‌రెడ్డి, నం.1 న్యూస్‌ ఛానల్‌ అధినేత సుధాకర్‌నాయుడు సహా 20 మందికి సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేసారు. సెప్టెంబరు 4న గుంటూరు, రాజమహేంద్రవరంలోని కార్యాలయాల్లో విచారణకు హాజరుకావాలని నోటీసులో పేర్కొన్నారు.

Read More »

‘జనతా గ్యారేజ్’ రివ్యూ

  సినిమా      : జనతా గ్యారేజ్                                                                                                 నటీనటులు : ఎన్టీఆర్, మోహన్ లాల్, నిత్యామీనన్, సమంత,సాయి కుమార్, …

Read More »

మరో 24 గంటల పాటు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..

మరో 24 గంటల పాటు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ఒడిశా, ఛత్తీస్‌ఘడ్‌ మీదుగా వాయువ్యదిశగా ఉపరితల ఆవర్తనం కదులుతోందని పేర్కొంది. ఈ ప్రభావంతో మోస్తరు, భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. హైదరాబాద్‌లో ఉదయం 11.30 గంటల వరకు 71 మి.మీ వర్షపాతం నమోదైంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో కురిసిన వర్షాలకు ఎక్కడికక్కడ ట్రాఫిక్ స్తంభించి, వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. అంతే కాకుండా ఈ వర్షాలకు అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు రాకూడదని, …

Read More »

పవన్ దెబ్బకు..ప్రత్యేక ప్రకటన?

ఆంధ్రప్రధేశ్ కు ప్రత్యేహోదా కల్పించాలని నినాదాలు, నిరసనలు చేపట్టిన ప్రజలు ఇప్పుడు సహనం కోల్పోయారన్న విషయం తెలుస్తూనే ఉంది. కేంద్రంతో అమీ తుమీ తేల్చుకునే ఆలోచనలో ఉన్నారు. హోదా కోసం అటు అధికారులు కూడా తమ వంతుగా వత్తిడిలు కేంద్రం పై తెస్తున్నా..కేంద్రం మాత్రం హోదా పై తుది నిర్ణయాన్ని ప్రకటించకుండా ఉంది. ఇదే విషయమై ప్రత్యేక హోదా కోసం ఎంతకైనా తెగిస్తామని, హోదాని సాధించుకోవడం  తమ హక్కు అని ఇటీవల తిరుపతిలో నిర్వహించిన బహిరంగ సభలో పవన్ చేసిన వ్యాఖ్యలు తెలిసిందే. అయితే …

Read More »

సెప్టెంబరు 20నుండి తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు

తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు సెప్టెంబర్‌ 20 నుంచి ప్రారంభం కానున్నాయి. బుధవారం జరిగిన శాసనసభ వ్యవహారాల సలహా సంఘంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. జీఎస్‌టీ బిల్లుకు ఆమోదం తెలిపిన తర్వాత బీఏసీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వర్షాకాల సమావేశాల అజెండాపై అన్నిపక్షాలతో ప్రభుత్వం చర్చించింది.

Read More »

టాయ్ లెట్ లో 2.5 కిలోల బంగారం..!

ఎయిరిండియా విమానంలోని టాయ్‑లెట్‑లో రెండున్నర కిలోల బంగారు ఆభరణాలను కనుగొన్నారు. కస్టమ్స్, సెంట్రల్ ఎక్సైజ్ అధికారులు ఈ నగలను స్వాధీనం చేసుకున్నారు. సోమవారం దుబాయ్ నుంచి పనాజీ (గోవా)కి వచ్చిన విమానంలో బంగారు నగలను అక్రమంగా తరలిస్తూ టాయ్‑లెట్‑లో దాచారని అధికారులు చెప్పారు. వీటి విలువ 75 లక్షల రూపాయల ఉంటుందని తెలిపారు. విమాన సిబ్బందిని విచారిస్తున్నట్టు కస్టమ్స్ అధికారి చెప్పారు. అలాగే విమానంలో వచ్చిన ప్రయాణికుల జాబితాను తీసుకుని విచారిస్తామని తెలిపారు. కస్టమ్స్ అధికారుల తనిఖీ అనంతరం విమానం పనాజీ నుంచి బెంగళూరుకు …

Read More »