Breaking News

ANDHRA PRADESH

pj న్యూస్ @ఘాజీ ప్రిమియర్ టాక్…!

ghaji-premiyar

సినిమా పేరు: ఘాజీ నటీనటులు: రానా.. కె.కె.మీనన్‌.. అతుల్‌ కులకర్ణి.. తాప్సి.. ఓంపురి.. నాజర్‌.. సత్యదేవ్‌.. భరత్‌రెడ్డి తదితరులు సంగీతం: కె ఛాయాగ్రహణం: మది కూర్పు: శ్రీకర్‌ప్రసాద్‌ నిర్మాణ సంస్థలు: పీవీపీ సినిమా.. మాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ రచన – దర్శత్వం: సంకల్ప్‌ విడుదల: 17-02-2017 యుద్ధం.. దేశభక్తి.. ఇవి కూడా కమర్షియల్‌ అంశాలే. ఎంతటి కర్కోటకుడికైనా తన దేశంపై కొద్దో గొప్పో ప్రేమ ఉంటుంది. కాలు దువ్విన శత్రుదేశంపై తడాఖా చూపించిన సందర్భం వచ్చినప్పుడు.. తప్పకుండా గర్వంతో ఛాతీ ఉప్పొంగుతుంది. కానీ అలాంటి బలమైన …

Read More »

  ఎపి ప్రత్యేక హోదాకు ….టిఆర్ఎస్ మద్దతు

ప్రత్యేక హోదా అంశంపై టిఆర్ఎస్ స్పందన ఆసక్తికరంగా ఉంది. తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ కుమార్తె, నిజామాబాద్ లోక్ సభ సభ్యురాలు కవిత మాట్లాడుతూ ఎపిలో ప్రత్యేక హోదా డిమాండ్ కు తాము కూడా మద్దతు ఇస్తామని అన్నారు.ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవలసిన బాద్యత ఆయా పార్టీలపై ఉంటుందని ఆమె అన్నారు.ఎపికి మద్దతు ఇవ్వాలని తాము కూడా కోరుతున్నామని ఆమె చెప్పారు.ఎపిలో అదికార తెలుగుదేశం పార్టీ నేతలు తమకు ప్రత్యేక హోదా అవసరం లేదని చెబుతున్న తరుణంలో పొరుగు రాష్ట్రానికి చెందిన ఎమ్.పి కవిత …

Read More »

ప్రజల నిరసనను అడ్డుకోవద్దు – పవన్

విశాఖ సిటీ :-విశాఖపట్నంలో ఆర్కే బీచ్‌లో వేదికగా యువత నిర్వహిస్తున్న ప్రత్యేక హోదా పోరాటంపై మరోసారి ట్వీట్ చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్‌. ప్రత్యేక హోదా ఏపీ ప్రజల హక్కని… దాన్ని అడ్డుకోవద్దని విజ్ఞప్తి చేశారు. దీనికి రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదన్నారు పవన్. అయితే, ఇచ్చిన హామీ నిలబెట్టుకోకుంటే శాంతియుత నిరసనలు తెలిపే హక్కు పౌరులకు ఉందని.. ప్రజల నిరసనను అడ్డుకోవద్దని ట్వీట్ చేశారు. 26న విశాఖలో ఎలాంటి నిరసనలకు అనుమతి లేదని డీజీపీ ప్రకటించిన కొద్దిసేపటికే పవన్ ట్విట్టర్‌లో స్పందించారు….⁠⁠⁠⁠

Read More »

బ్రాండ్ అంబాసిడర్‌గా కోనేరు హంపి.

విజయవాడ బ్రాండ్ అంబాసిడర్‌గా కోనేరు హంపిని ఎంపిక చేశారు. ఈ విషయాన్ని బెజవాడ మేయర్ కోనేరు శ్రీధర్‌ వెల్లడించారు. బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండేందుకు అంగీకరించిన హంపికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. స్వచ్చభారత్‌లో విజయవాడ 23 స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చిందని… నగరాన్ని మొదటి స్థానంలో నిలిపేందుకు ప్రజల సహకారం కూడా ముఖ్యమన్నారు. విజయవాడలో స్వచ్చభారత్‌కు సంబంధించి స్వచ్చతా యాప్‌ ద్వారా హంపి ప్రసంగాన్ని వినవచ్చని కోనేరు శ్రీధర్ చెప్పారు. బెజవాడ బ్రాండ్ అంబాసిడర్‌గా పనిచేయడం తనకు ఎంతో ఆనందంగా ఉందని కోనేరు హంపి చెప్పారు. రెండేళ్లుగా …

Read More »

దేశంలోనే అతిపెద్ద జాతీయ జెండా..

kcr-0001-1-300x138

తెలంగాణ ఆవిర్భావదినోత్సవం సందర్భంగా జూన్ 2న నగరంలోని సంజీవయ్య పార్కులో దేశంలోనే అతిపెద్ద జెండా ఆవిష్కరణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ జెండాను జూన్ 2న ముఖ్యమంత్రి కే.సి.ఆర్ ఆవిష్కరించనున్నారు. 298 అడుగుల ఎత్తు ఉన్న పోల్ ను  పార్క్ లో ఏర్పాటు చేయనున్నారు. జాతీయ జెండా 108 అడుగుల పొడవు, 92 అడుగుల వెడల్పుతో ఏర్పాటు చేస్తున్నారు. జెండా బరువు 92 కేజీలు ఉన్నట్లు సమాచారం.

Read More »