Breaking News
rashmi_8216

సుధీర్‌తో పెళ్లి.. రచ్చ రచ్చ…?

ఉగాది ఈవెంట్ కోసం టీవీలో సుధీర్‌తో రష్మి తన పెళ్లయినట్టు నటించడమేమో కానీ ఇప్పడది ట్విట్టర్‌లో రచ్చ రచ్చ అవుతోంది. నెటిజన్ల రకరకాల ప్రశ్నలకు రష్మి ఓపికగా సమాధానం చెబుతోంది. పాజిటివ్, నెగిటివ్ తేడా లేకుండా నెటిజన్లు ఎవరికి తోచినట్టుగా వారు ఈ పెళ్లిపై స్పందిస్తున్నారు. ఒక నెటిజన్ ‘‘నేను షో ప్రోమోని యూ ట్యూబ్‌లో చూశాను. ఒకవేళ నీ ఈగోని, ఐడెంటిటీని పక్కన పెడితే, టీవీ ప్రజలను రియల్ ఆర్ట్స్ వైపు స్పందించనివ్వకుండా చేస్తోందని నీకు అర్థమవుతుంది. వారిలోని సౌందర్యాన్ని ఆరాధించే సెన్స్‌ని కొన్ని షోస్ చంపేస్తున్నాయి’’ అని ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. దీనికి సీరియస్ అయిన రష్మి ‘‘మేమేమి.. మీరు విమర్శించేందుకే పుట్టలేదు. నేను నీ గురించి మాట్లాడటం లేదు. చాలా మంది మంచైనా.. చెడైనా మాకే అన్వయించి చెబుతుంటారు’’ అని ఆగ్రహం వ్యక్తం చేసింది. పెళ్లి విషయమై చాలా మంది నెటిజన్లు ట్వీట్స్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరికీ ఓపికగా ఆన్సర్ చేస్తోంది రష్మి.

Image result for rashmi and sudheer