Breaking News
Priya-Prakash-Varrier-1

ప్రియా తమిళ్ స్టార్ హీరో సూర్య సరసన ఛాన్స్ కొట్టేసింది…?

మలయాళం సెన్సేషన్ ప్రియా ప్రకాష్ వారియర్ తమిళ్ స్టార్ హీరో సూర్య సరసన ఛాన్స్ కొట్టేసింది. ఈ ముద్దుగుమ్మ తను నటించిన ‘ఒరు ఆదార్ లవ్’ మూవీలోని ‘మాణిక్య మలరాయ పూవి’ అనే ఒక్క సాంగ్‌తో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. కేవీ ఆనంద్ డైరెక్షన్‌లో సూర్య హీరోగా తెరకెక్కబోయే ఓ సినిమా కోసం చిత్రబృందం ప్రియను సంప్రదించింది. దీనికి ఈ ముద్దుగుమ్మ ఓకే చెప్పేసినట్టు సమాచారం. ఇక అధికారిక సమాచారం రావడమే తరువాయి.

ప్రసిద్ధ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ ఈ మూవీని నిర్మించనుంది. ఇప్పటికే సూర్య, కేవీ ఆనంద్ డైరెక్షన్‌లో అయాన్, మాత్రన్ అనే రెండు సినిమాలు వచ్చాయి. ఇప్పుడు ఈ సినిమా మూడవది. ఈ సినిమాకు హ్యారిస్ జయరాజ్ మ్యూజిక్ అందిస్తున్నారు. సూర్య ప్రస్తుతం సెల్వ రాఘవన్ డైరెక్షన్‌లో ఎన్‌జీకే షూటింగ్‌లో ఉన్నాడు. ఈ షూటింగ్ పూర్తైన వెంటనే ప్రియాతో సినిమా సెట్స్‌పైకి రానుంది.