Breaking News
rashmi_8216

నిజమా లేదంటే ఫేకా? సుధీర్‌ని నువ్వు పెళ్లి చేసుకున్నావా…?

ఇటీవల ఉగాది పర్వదినం సందర్భంగా ఓ షోలో ప్రముఖ యాంకర్ రష్మి, కమెడియన్ సుధీర్ పెళ్లి చేసుకున్నట్టుగా చూపించారు. అది నిజంగా నిజం కాదులెండి. కానీ అసలు నిజంగా పెళ్లైందా? లేదంటే ఫేకా? అన్న సందేహం ఇంకా నెటిజన్లలో కొనసాగుతోంది. ఇదే విషయాన్ని ఓ నెటిజన్ రష్మిని ట్విట్టర్‌లో నేరుగా అడిగేశాడు. ‘నిజమా లేదంటే ఫేకా? సుధీర్‌ని నువ్వు పెళ్లి చేసుకున్నావా.. లేదా? మాకు క్లారిటీ కావాలి’ అని రష్మికి ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. దీనికి రష్మి ‘షో చివరి వరకూ చూడండి అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది’ అని రిప్లై ఇచ్చింది.1520583642-117దీనిపై నెటిజన్లు ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు. ఒకరేమో ‘మాకు నిజమే అనిపిస్తోంది మేడమ్. మీరు సుధీర్‌తో లవ్‌లో ఉన్నారనిపిస్తోంది’ అని ట్వీట్ చేశారు. ‘చూశాకే క్లారిటీ రావట్లేదు నిజంగా చేసుకుని అలా కవర్ చేశారేమోనని’ అని మరొకరు ట్వీట్ చేశారు. ‘సుధీర్‌కి వచ్చిన కల నిజం అయితే బాగుంటుందని మేము దేవుడిని వేడుకుంటున్నాం’ అని ఇంకొకరు ఇలా వెల్లువలా కామెంట్స్ పెడుతున్నారు.