Breaking News
1512116663-171

వినూత్నంగా `భ‌ర‌త్ అను నేను`…?

సినిమా విడుద‌ల‌కు ముందు నిర్వ‌హించే ఆడియో విడుద‌ల లేదా ప్రీ-రిలీజ్ ఈవెంట్ల ద్వారా సినిమాల‌కు భారీ ప్ర‌చారం ల‌భిస్తుంది. ఆయా కార్య‌క్ర‌మాల నుంచే సినిమా ప‌బ్లిసిటీ ప్రారంభ‌మ‌వుతుంది. అందుకే ఆ కార్య‌క్రమాన్ని సినిమా జ‌నాలు చాలా సీరియ‌స్‌గా తీసుకుంటారు. భారీగా ఖ‌ర్చుపెట్టి వేడుక నిర్వ‌హిస్తారు. తాజాగా సినిమా నేప‌థ్యాన్నిత‌ల‌పించేలా సెట్‌లు వేయ‌డం కూడా మొద‌లుపెట్టారు. ఇటీవ‌ల విశాఖ‌ప‌ట్నంలో జ‌రిగిన `రంగ‌స్థ‌లం 1985` ఆడియో విడుద‌ల కార్య‌క్ర‌మ వేదిక కోసం సెట్ వేసిన విష‌యం తెలిసిందే. గ్రామీణ నేప‌థ్యం థీమ్‌తో ఆ సెట్ వేశారు. త్వ‌ర‌లో మ‌హేష్ బాబు `భ‌ర‌త్ అనే నేను` సినిమా ఆడియో విడుద‌ల కార్య‌క్ర‌మం హైద‌రాబాద్‌లో జ‌రుగ‌నుంది. పూర్తి పొలిటిక‌ల్ బ్యాక్‌డ్రాప్‌తో తెర‌కెక్కుతున్న ఈ సినిమా వేడుక కోసం కూడా ఓ భారీ సెట్ వేయ‌బోతున్నార‌ట‌. అసెంబ్లీని ప్ర‌తిబింబించేలా ఆ సెట్ ఉంటుంద‌ని స‌మాచారం. వ‌చ్చే నెల‌లో ఈ కార్య‌క్ర‌మం జ‌రుగ‌నుంది.