Breaking News
7ddbc600-9f4d-439e-9c8e-9cc6aa354435

బాబు గురించి గవర్నర్ సంచలన వ్యాఖ్యలు…!

గవర్నర్‌ నరసింహన్‌ చంద్రబాబును అలా అంటారని ఎవరూ ఊహించి ఉండరు. ఎందుకు అంటే గవర్నర్‌పై ఏపీ ప్రజలకు ఉన్న అభిప్రాయం వేరు. ఆయన తరచు తెలంగాణకు అనుకూలంగా ఉంటారని, తెలంగాణ ఎజెండాను మోస్తారని, ఏపీ అన్నా, చంద్రబాబు అన్నా పడదని, బాబుకు వ్యతిరేకంగా కేంద్రానికి నివేదికలు ఇస్తారని అందరూ భావిస్తారు. కానీ అనూహ్యంగా గవర్నర్ నరసింహన్‌ చంద్రబాబును ఆకాశానికి ఎత్తేసారు. చంద్రబాబు లాంటి సీఎంను కలిగి ఉండటం ఏపీ ప్రజలు చేసుకున్న అదృష్టం అని మనస్ఫూర్తిగా అభినందించారు.అసెంబ్లీలో ప్రసంగం పూర్తి చేసుకున్న గవర్నర్ సెక్రటేరియట్‌లోని సీఎం ఆఫీసులో ఉన్న రియల్‌ టైమ్‌ గవర్నెన్స్‌ సెంటర్‌ను సతీ సమేతంగా సందర్శించారు.

Image result for chandrababuఅంతకు ముందు రాష్ట్రపతితో కలిసి గవర్నర్‌ వచ్చినా తన శ్రీమతికి ఆ అద్భుతం చూపించటానికి తీసుకు వచ్చినట్టు భావిస్తున్నారు. దాదాపు గంటకు పైగా సమయాన్ని అక్కడ గడిపిన గవర్నర్ దంపతులకు చంద్రబాబు దాని పని విధానాన్ని కూలంకుషంగా తానే స్వయంగా ప్రజెంటేషన్‌ ఇచ్చి మరీ ఎక్స్‌ప్లెయిన్ చేశారు. ఇటీజ్‌ రియల్లీ ఫెంటాస్టిక్… ఎక్స్‌లెంట్.. అని ప్రజెంటేషన్‌ మధ్యలో పలు మార్లు గవర్నర్ నరసింహన్ దంపతులు ప్రశంసలు కురిపించారు. మాకు ఓ రోజంతా ఇక్కడే గడపాలని ఉందని అన్నారు. నాలెడ్జ్‌, టెక్నాలజీల సమ్మేళనంతో పాలన సాగిస్తుండటం అద్భుతమని ముఖ్యమంత్రి చంద్రబాబును గవర్నర్ మెచ్చుకున్నారు.సర్వెలెన్స్ కెమెరాలు, డిజిటల్ క్లాసు రూములు, లాక్డ్ హౌస్ మేనేజ్మెంట్, రేషన్ కార్డులు, పెన్షన్లు, డ్రోన్లు, ట్రాఫిక్ మేనేజ్మెంట్, పబ్లిక్ గ్రీవియెన్స్ తదితర అంశాలన్నీ ఆసక్తిగా పరిశీలించారు. మీలాంటి విజనరీ సీఎం వుండటం ఆంధ్రప్రదేశ్ ప్రజల అదృష్టం అని అభినందించారు. అంతకు ముందు గవర్నర్ దంపతులు సచివాలయం మొత్తాన్ని బ్యాటరీ కారులో తిరిగి పరిశీలించారు.