Breaking News
Untitled-1 copy

ఆలు రైతా – Aloo Raita

కావలసిన పదార్థాలు:hqdefault

ఆలు -రెండు,

పెరుగు – రెండు కప్పులు,

పచ్చిమిర్చి – రెండు,

వెల్లుల్లి – రెండు రేకలు,

జీరాపొడి – అర టీ స్పూను,

పుదీనా ఆకులు – ఒకటి టేబుల్‌ స్పూను,

ఉప్పు – రుచికి తగినంత.
తయారుచేసే విధానం:

ముందుగా ఆలుగడ్డల్ని మెత్తగా ఉడికించి తొక్కతీసి మెదిపి పెట్టుకోవాలి. పచ్చిమిర్చి, పుదీనా, వెల్లుల్లి గ్రైండు చేసుకోవాలి. తర్వాత పెరుగులో మెదిపిన ఆలు గుజ్జు, పుదీనా మిశ్రమం, జీరాపొడి, ఉప్పు వేసి బాగా కలపాలి. ఈ రైతా పరాటాల్లోకి, అన్నంలోకి బాగుంటుంది.