Breaking News
6300-raju-gari-gadhi-2-logo-revealed (1)

రాజుగారిగది 2 రివ్యూ….

అగ్ర తార‌లు నాగార్జున, స‌మంత తొలిసారి  ఓ హార‌ర్ కామెడీ క‌థ‌లో న‌టించ‌డం.. విజ‌య‌వంత‌మైన `రాజుగారి గ‌ది`ని సిరీస్‌గా మార్చిన చిత్రం కావ‌డం.. పెళ్లి త‌ర్వాత విడుద‌ల‌వుతున్న స‌మంత తొలి  చిత్రం కూడా ఇదే అవుతుండ‌డంతో  `రాజుగారి గ‌ది2`పై  ప్రేక్ష‌కుల్లో ప్ర‌త్యేక‌మైన ఆస‌క్తి ఏర్ప‌డింది. ప్ర‌చార చిత్రాలు ఆ ఆస‌క్తిని, అంచ‌నాల్ని మ‌రింత‌గా పెంచాయి.  అందుకు త‌గ్గ‌ట్టుగానే సినిమా ఉందా?  ఆత్మ‌గా స‌మంత‌, మెంట‌లిస్ట్‌గా నాగార్జున చేసిన సంద‌డి ఎలా  ఉంది?  ద‌స‌రా హంగామా త‌ర్వాత వ‌స్తున్నఈ  సినిమా బాక్సాఫీసుని ఏమేర‌కు ప్ర‌భావితం చేయ‌బోతోంది?Image result for raju gari gadhi 2

క‌థేంటంటే: అశ్విన్‌(అశ్విన్‌), కిశోర్‌(వెన్నెల కిశోర్‌), ప్రవీణ్‌(ప్రవీణ్‌) మంచి స్నేహితులు. ఇళ్లల్లో ఇబ్బందులున్నా, కష్టాలకు ఓర్చి రాజుగారి రిసార్ట్‌ను కొనుగోలు చేస్తారు. కానీ రిసార్ట్‌లో ఓ దెయ్యం వారిని భయపెడుతుంటుంది. దాంతో ఆ ముగ్గురూ చర్చి ఫాదర్‌ (నరేశ్‌)ని సంప్రదిస్తారు. ఆయన సలహాతో మెంటలిస్ట్‌ రుద్ర(నాగార్జున) రంగంలోకి దిగుతారు. కళ్లలో చూస్తూ మనసులో ఏముందో చెప్పగల సమర్థుడు రుద్ర. పోలీసులు కూడా పలు కేసుల్లో ఆయన సహకారం తీసుకుంటారు. ఫాదర్‌ కోరిక మేరకు రిసార్ట్‌లోకి అడుగుపెట్టిన రుద్రకు సుహానిస(సీరత్‌ కపూర్‌)పై అనుమానం వస్తుంది. ఆ తర్వాత అమృత(సమంత) అనే అమ్మాయి ఆత్మ ప్రతీకారం కోరుకుంటుందన్న విషయం తెలుసుకుంటాడు.ఇంతకీ అమృత ఎవరు? రాజుగారి రిసార్ట్‌కి ఆమెకి సంబంధం ఏంటి? ఆమె ప్రతీకారం ఎవరిపైన? అమృతకి సుహానిసకి బంధం ఏమైనా ఉందా అన్న విషయాలు తెరపై చూడాలి.Image result for raju gari gadhi 2

ఎలా ఉందంటే?: ఒక ఆత్మ ఆ ఆత్మకి సాయంగా నిలిచిన ఓ మెంటలిస్ట్‌ కథే ఈ చిత్రం. హారర్‌ కామెడీ నేపథ్యంతో కూడుకున్న చిత్రమే అయినా, ఓ మంచి సందేశంతో తీర్చి దిద్దారు. ఆరంభ సన్నివేశాలు సాదాసీదాగానే అనిపించినా, దెయ్యం భయపెట్టడంతోనే కథ వూపందుకుంటుంది. తొలి సగ భాగం సన్నివేశాలు చాలా వరకు కిశోర్‌, అశ్విన్‌, ప్రవీణ్‌ త్రయంపైనే హస్య ప్రధానంగా సాగుతాయి. హారర్‌ నేపథ్యం ఉన్నా, కేవలం కొన్ని సన్నివేశాలు మాత్రమే భయపెడతాయి. నాగార్జున పాత్ర ప్రవేశంతో కథ మరింత వేగం పుంజుకుంటుంది. ఆయన ఓ కేసు చిక్కుముడిని విప్పే విధానం ఆసక్తికరంగా అనిపిస్తుంది. ద్వితీయార్ధం సినిమాకి ప్రధాన బలం. అమృత పాత్ర, ఆమె నేపథ్యం కుటుంబ ప్రేక్షకులను సైతం ఆకట్టుకునేలా ఉన్నాయి. పతాక సన్నివేశాలు సినిమాకు ప్రాణం పోశాయని చెప్పొచ్చు. మహిళలకి రక్షణ, జీవితం అంటే ఏమిటి? అనే విషయాలపై సందేశం హృదయానికి హత్తుకుంటుంది. నాగార్జున.. సమంత మధ్య వచ్చే చివరి 20 నిమిషాల సన్నివేశాలు, సంభాషణలు బాగున్నాయి. కిరణ్‌ అనే పాత్రలో అభినయ నటన ఆకట్టుకుంటుంది. నాగార్జున సమంతలాంటి స్టార్ల స్థాయికి తగ్గ చిత్రం ఇది. కాకపోతే తొలి సగ భాగం సన్నివేశాల్లో వినోదంపై మరింత కసరత్తు చేస్తే బాగుండేది. కుటుంబం సమేతంగా చూసే చిత్రంగా దర్శకుడు దీన్ని తీర్చిదిద్దాడు. ప్రేక్షకులకు నచ్చే అంశాలు పుష్కలంగా ఉండటంతో ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద సందడి చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.Image result for raju gari gadhi 2

ఎవరెలా చేశారంటే..: నాగార్జున మోడ్రన్‌ సెయింట్‌ రుద్ర పాత్రలో ఇమిడిపోయారు. హావభావాలనుతోనూ తన డైలాగ్‌ స్టైల్‌తోనూ హీరోయిజాన్ని పండించారు. సమంత, లా చదువుకున్న అమ్మాయిగా చక్కగా నటించింది. నటీనటులు కొత్త పాత్రల్లో కనిపిస్తే ఆ ప్రభావం ఎలా ఉంటుందో సినిమాలో నాగార్జున.. సమంత పాత్రలే చెబుతాయి. సీరత్‌ అందాల ఆరబోత కాస్త శ్రుతి మించినా, ఆమె ప్రాతకీ ప్రాధాన్యం ఉంది. చాలా సన్నివేశాల్లో ముఖకవళికలతోనే సన్నివేశాలను రక్తికట్టించింది. అభినయ నటన పతాక సన్నివేశాలకు ప్రధాన బలం. సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది. ద్వితీయార్ధంలో అబ్బూరి రవి కలం పదును స్పష్టంగా తెలుస్తుంది. తమన్‌ సంగీతం, దివాకరన్‌ కెమెరా పనితనం బాగా కుదిరింది. రాజుగారి గది సాధించిన విజయాన్ని నిలబెట్టుకోవాలనే కసితో పనిచేశాడు ఓంకార్‌. నిర్మాణ విలువలు, విజువల్‌ ఎఫెక్ట్స్‌ బాగున్నాయి.Image result for raju gari gadhi 2

చివరిగా: సకుటుంబ సపరివార సమేతంగా ‘రాజుగారిగది రెండో’ గది వెళ్లొచ్చు.

చిత్రం: రాజు గారి గ‌ది 2
న‌టీన‌టులు: నాగార్జున‌.. స‌మంత.. సీర‌త్ క‌పూర్‌.. న‌రేష్‌.. వెన్నెల కిషోర్‌.. ప్ర‌వీణ్‌.. అశ్విన్‌.. ష‌క‌ల‌క శంక‌ర్‌.. అవినాష్ త‌దిత‌రులు.
స‌ంగీతం: త‌మ‌న్‌
ఛాయాగ్ర‌హ‌ణం: ఆర్‌.దివాక‌ర‌న్‌
మాట‌లు: అబ్బూరి ర‌వి
క‌ళ‌: ఎ.ఎస్‌.ప్ర‌కాష్‌
నిర్మాత‌: ప‌్ర‌సాద్ వి.పొట్లూరి
ద‌ర్శ‌క‌త్వం: ఓంకార్‌.
నిర్మాణ సంస్థ‌లు:  పీవీపీ సినిమా-మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్, ఓక్ ఎంట‌ర్‌టైన్‌మెంట్
విడుద‌ల‌:13-10-2017 Related image