Breaking News
3_beauty_tips_scrubbing_hands

అందమైన చేతుల కోసం…!

Image result for beauty hands pics * ఉడకబెట్టిన బంగాళదుంపను పేస్ట్ చేసుకుని అరచేతులకు పట్టించి మసాజ్ చేసుకుంటే చేతులు మృదువుగా ఉంటాయి.

  • ఒక స్పూన్ పాలమీగడలో కొద్దిగా నిమ్మరసం, కొంచెం గ్లిజరిన్ వేసి కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని రాత్రి పడుకునే ముందు చేతులకు పట్టించి మసాజ్ చేసుకుంటే అందమైన చేతులు మీ సొంతం.
  • అరచేతులు పొడిబారినట్టయితే రాత్రి పడుకునే ముందు కొబ్బరినూనెతో చేతులను, చేతి వేళ్ళను బాగా మర్ధనా చేయాలి. ఇలా చేయడం వలన చేతులకు వ్యాయామం కలిగి రక్త ప్రసరణ బాగా జరుగుతుంది.
  • ఒక గిన్నె లేక వెడల్పుగా ఉన్న పాత్రలో నీళ్ళు పోసి, దానిలో కొద్దిగా ఉప్పు, నిమ్మరసం కలిపి ఈ మిశ్రమాన్ని ముంజేతి నుండి భుజాల వరకు రాయాలి. ఇలా వారానికి 2 సార్లు చేయాలి. ఇల చేయడం వలన చేతులు మృదువుగా తయారై మృతకణాలు తొలగిపోతాయి.
  • ఒక గిన్నెలోకి నీళ్ళు తీసుకొని అందులో ఒక టీ స్పూన్ ఆల్మండ్ ఆయిల్ కలిపి చేతులకు పట్టించాలి. ఈ మిశ్రమం చేతులపై ఉండే మృత కణాలను, పొడి చర్మాన్ని తొలగించి చేతులను సున్నితంగా చేస్తుంది.
  • అరకప్పు పాలకు టీ స్పూన్‌ టేబుల్‌ సాల్ట్‌ ను కలిపి దానితో మో చేతులపై సున్నితంగా రుద్దాలి. మృతకణాలు తొలగిపోయి ముఖం కొత్త మెరుపును సంతరించుకుంటుంది. అంతేకాదు పాల వల్ల ఇది చక్కటి మాయిశ్చరైజర్‌ గా కూడా పనిచేస్తుంది.